హయత్ నగర్ లో కారులో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు స్థానికులు. సోమవారం ( ఆగస్టు 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీలో పార్క్ చేసిన టాటా ఇండికా కారులో మంటలు చెలరేగాయి.
ఘటన జరిగిన సమయంలో భారీగా శబ్దం రావడంతో ఏం జరుగుతుందో తేలిక భయాందోళనకు గురయ్యారు కాలనీవాసులు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారు చాలా రోజుల నుండి వాడకపోవడంతో పక్కన పెట్టామని అంటున్నాడు కారు ఓనర్.
అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు చెలరేగిన సమయంలో బాము పేలుడు లాగా భారీగా శబ్దం వచ్చిందని.. ఏం జరుగుతుందో తెలియక బయపడ్డామని అంటున్నారు స్థానికులు. కారులో మంటలు గమనించి ఆర్పేసేలోపే పూర్తిగా దగ్దమైందని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
