హైద‌రాబాద్ లోని ఈ ప్రాంతాల్లో రెండు రోజులు నీళ్లు బంద్

హైద‌రాబాద్ లోని ఈ ప్రాంతాల్లో రెండు రోజులు నీళ్లు బంద్

హైదరాబాద్ -రంగారెడ్డి మేడ్చల్ వాసులకు ముఖ్య గమనిక. మర్మూర్ నుంచి బొమ్మక్కల్ నీటి పైప్‌లైన్‌పై లీకేజీలను పరిష్కరించడానికి HMWS&SB మరమ్మతు పనులు  చేపట్టింది. దీంతో జూలై 19, 20 తేదీల్లో  హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలకు 24 గంటల తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

ఎర్రగడ్డ, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, అల్వాల్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సూరారం వంటి ప్రాంతాల్లో జూలై 19 ఉదయం 6 గంటల నుంచి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీళ్లు  రావని అధికారులు తెలిపారు.

 కొండాపూర్, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, కొంపల్లి, గొండ్లపోచంపల్లి, జవహర్ నగర్‌లలో కూడా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
 నగర వాసులు  అసౌకర్యానికి గురికాకుండా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని హెచ్‌ఎండబ్ల్యుఎస్&ఎస్‌బి  కోరింది.