
పతంగుల పోటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్(Pathang). ప్రీతి పగడాల(Preethi pagadala), ప్రణవ్ కౌశిక్(Praveen koushik), వంశీ పూజిత్(Vamsi poojitha) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్(SP Charan) కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్ట్ చేస్తుండగా, విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్, సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. ‘సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ కామెడీ మూవీ ఇది. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్ ఉంటుంది’ అని మేకర్స్ తెలియజేశారు.