మలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’. మహేష్ నారాయణన్ దర్శకుడు. మే1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. శుక్రవారం జీ5 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
నేషనల్ సెక్యూరిటీ, ప్రభుత్వ నిఘా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించారు. డీఆర్‌డీవో ఆఫీసర్‌గా మమ్ముట్టి నటించగా, తనపై పడిన దేశద్రోహి అనే ముద్రను చెరిపేసేందుకు సహాయపడే స్నేహితుడిగా మోహన్‌లాల్, లాయర్ పాత్రలో నయనతార నటించారు. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో కుంచాకో బోబన్, రేవతి కీలకపాత్రలు పోషించారు.
