అలాంటి వాళ్లు వెళితేనే మంచిది .. రాజురవితేజకు పవన్ కౌంటర్

అలాంటి వాళ్లు వెళితేనే మంచిది .. రాజురవితేజకు పవన్ కౌంటర్

పార్టీకి రాజీనామా చేసిన పొలిట్ బ్యూర్ సభ్యుడు రాజు రవితేజపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వెళ్లిపోయే వాళ్లు హాయిగా వెళ్ళొచ్చంటూ కౌంటర్ వేశారు. పది రూపాయల కోసం వెళ్లేవాళ్లని ఎవరూ ఆపరని..చాలా సంతోషంగా వెళ్లిపోవచ్చని అన్నారు. తనకున్న బలం ఒకశాతమో రెండు శాతమో చాలా బలమైందన్నారు. పోరాటానికి లక్షల మంది అవసరం లేదని..బలమైన వాళ్లు వందమంది చాలన్నారు. డబ్బుకు లొంగిపోయే వ్యక్తులు అవసరం లేదని.. కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కొందరున్నా చాలన్నారు. ఒకరి తాలుక శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దన్నారు పవన్.