స్పీడ్ పెంచిన పవన్.. బ్యాక్ టు భగత్ సింగ్ షూట్

స్పీడ్ పెంచిన పవన్..  బ్యాక్ టు  భగత్ సింగ్ షూట్

ఓ వైపు పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉంటూనే మరోవైపు  బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటూ  కమిటైన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్.  ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ కాగా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది.  రీసెంట్‌‌‌‌‌‌‌‌గా  ‘ఓజీ’ సినిమాను కూడా పూర్తి చేశారు. తాజాగా ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్’ మూవీపై ఫోకస్ పెట్టారు పవన్. హరీష్ శంకర్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ గతంలో కొంత భాగం చిత్రీకరణ  జరగగా మంగళవారం నుంచి కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.  

దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్  జరగనుందని తెలుస్తోంది. ముందుగా  పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌పై కీలక సన్నివేశాలను  చిత్రీకరించనున్నట్టు సమాచారం. మంగళవారం ఆయన ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌తో పాటు కీలక నటీనటులు ఈ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నారు. ఇందులో పవన్ స్టైలిష్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  

అశుతోష్ రానా, నవాబ్ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్ వంశీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కె. దశరథ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే రాసిన ఈ చిత్రానికి ఆయనంక బోస్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.