చిరు మూవీ సెట్లో పవన్ సందడి

చిరు మూవీ సెట్లో పవన్ సందడి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా సెట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా నుండి విడుదల కానున్న 'బాస్ పార్టీ' సాంగ్ ను వీక్షించారు. సాంగ్ ఎంతో బాగుందని పవన్ తెలిపారు. అన్నయ్యతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇద్దరు చిరునవ్వులు చిందించారు. ఈ ఫోటోలను దర్శకుడు బాబీ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సెట్ కు పవన్ తోపాటు దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం రత్నం కూడా వెళ్లారు.

ఇక ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. మేకర్స్ ఇవాళ దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు. సాంగ్ లో చిరంజీవి గళ్ళ లుంగీ, కలర్ ఫుల్ షర్ట్ లో తనదైన స్టయిల్ లో నడుస్తూ మాస్ అవతారంలో కనిపించాడు. ఈ సాంగ్ లో చిరు సరసన ఊర్వశి రౌతెల్లా అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.