పాయల్ మంగళవారం బాక్సాఫీస్ టార్గెట్..ఎంతో తెలిస్తే షాక్!

పాయల్ మంగళవారం బాక్సాఫీస్ టార్గెట్..ఎంతో తెలిస్తే షాక్!

అజయ్ భూపతి (Ajaybhupathi) డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మంగళవారం (Mangalavaram). ఇవాళ థియేటర్లో గ్రాండ్గా రిలీజైన సినిమా..అజయ్ స్క్రీన్ ప్లే తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ముందుగా రిలీజైన ట్రైలర్ తోనే ఆడియన్స్లో భారీ అంచనాలు పెంచేసిన మంగళవారం..రిలీజ్ తో ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు మేకర్స్. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే  ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం.

రిలీజ్ కు ముందే ఈ సినిమా బిజినెస్ లెక్కలు అన్ని మారిపోయాయి. నైజాంలో 3.20 కోట్లకి రైట్స్ అమ్ముడైపోయాయి. ఆంధ్రా, సీడెడ్ కలిపి 7 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో 2 కోట్ల వరకు బాగానే మార్కెట్ అయ్యింది. మొత్తం రూ.13.20 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా మంగళవారం సినిమా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో పాటు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా కూడా లాభాలు భారీగానే వచ్చాయి.

మంగళవారం మూవీతో రిలీజ్ కి ముందే ప్రొడ్యూసర్స్ కి అజయ్ భూపతి టేబుల్ ప్రాఫిట్ తెప్పించాడు. కాగా..ఈ మూవీ రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ తో  థియేటర్స్ లోకి వచ్చింది. ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. వీకెండ్ లో రిలీజ్ అయింది కాబట్టి..సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే శని, ఆదివారాలు థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్లు పడిపోవడం కన్ఫర్మ్ అనే మాట.. సినీ క్రిటిక్స్ నుంచి వినిపిస్తోంది.

గత చిత్రం మహా సముద్రం మూవీతో భారీ డిజాస్టర్ను చూసిన అజయ్ భూపతికి మంగళవారం ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.