నాకొక ఛాన్స్ ఇస్తారా.. కాంతార సీక్వెల్ కోసం పాయల్ రిక్వెస్ట్

నాకొక ఛాన్స్ ఇస్తారా.. కాంతార సీక్వెల్ కోసం పాయల్ రిక్వెస్ట్

సూపర్ హిట్ కాంతార(Kantara) సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు దర్శకుడు రిషబ్ శెట్టి(Rishab shetty). ఆ సందర్బంగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. దీంతో కాంతార సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

ఇదిలా ఉంటే.. అందరిలాగే కాంతార సీక్వెల్ పై తన ఇంట్రెస్ట్ ను చూపించారు మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవలే కాంతార సీక్వెల్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం అంటూ నోట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ నోట్ కు రిప్లయ్ ఇస్తూ.. నాకు ఒక అవకాశం ఇస్తారా అంటూ మేకర్స్ ను అడిగేసింది పాయల్. ఇందులో భాగంగా ఆమె రాస్తూ.. కాంతార చాప్టర్ 1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ ప్రెజెక్టు లో నటించడాన్నికి నేను ఆసక్తిగా ఉన్నాను. మంగళవారం సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. మీరు కూడా ఆ సినిమా చూస్తే నేను సంతోషిస్తాను. దయచేసి ఆడిషన్స్ కోసం నాకు కాస్త సమయం ఇవ్వండి.. అంటూ రాసుకొచ్చారు పాయల్. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పాయల్ చేసిన ఈ రిక్వెస్ట్ కు కాంతార 2 మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.