వీడియో తెచ్చిన తంట..నటి పాయల్ కు 8 రోజుల కస్టడీ

వీడియో తెచ్చిన తంట..నటి పాయల్ కు 8 రోజుల కస్టడీ

బాలీవుడ్ నటి, మోడల్ పాయల్ రోహత్గికి రాజస్థాన్ లోని బుండికోర్టు 8 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో పాయల్ డిసెంబర్ 24 వరకు జైలులోనే ఉండనుంది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫ్యామిలీపై అభ్యంతకర వీడియో పోస్ట్ చేసిన పాయల్ ను ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. నెహ్రూ, మోతిలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై పాయల్ రోహత్గి సెప్టెంబర్ 21న ఫేస్ బుక్ లో అభ్యంతకర వీడియో పోస్ట్ చేశారని రాజస్థాన్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు చర్మేష్ శర్మ అక్టోబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐటి చట్టంలోని 66, 67 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విచారించిన బుండి కోర్టు 8 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది.