పేటీఎంలో కాలిక్యులేటర్

పేటీఎంలో కాలిక్యులేటర్

పేటీఎం యూజర్లు ఇక నుంచి పేమెంట్ చేసేముందు స్క్రీన్​లో ఇంటర్నల్ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోవచ్చు. ఈ ఫీచర్​ పేటీఎంలో ఏదైనా పేమెంట్​ చేసే టైంలో ఆటో యాక్టివేట్ అవుతుంది. యాప్​లోనే డైరెక్ట్ పేమెంట్​ చేస్తే ఫైనల్ అమౌంట్​ కనిపిస్తుంది.

దీని కోసం ప్రత్యేకంగా స్పెషల్ కాలిక్యులేటర్ అప్లికేషన్​ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. పేటీఎంలోనే ఇన్​ బిల్ట్​ కాలిక్యులేటర్​ ఓపెన్ అవుతుంది. ఇది కిరాణా, కూరగాయల మార్కెట్​లు, ఫార్మసీలు, లోకల్ షాపుల్లో రోజువారీ రిటైల్ ట్రాన్సాక్షన్స్​ కోసం తీసుకొచ్చింది. ఇందులో వ్యక్తిగత వస్తువుల ధరలు తరచుగా పేమెంట్ చేసే ముందు కనిపిస్తాయి.

దీన్నెలా వాడాలంటే.. పేటీఎం యాప్ ఓపెన్​ చేసి క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయాలి. లేదా కాంటాక్ట్​ ఎంచుకోవాలి లేదా యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాత అమౌంట్ ఎంట్రీ స్క్రీన్​లో ఎంత పేమెంట్ చేస్తారో ఎంటర్ చేసేందుకు ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే మొత్తం ఆటోమెటిక్​గా కాలిక్యులేట్ అవుతుంది. పేమెంట్ మొత్తం ఎంత అనేది నెంబర్లు, లెటర్స్​లో కనిపిస్తుంది. ఫైనల్ అమౌంట్ కన్ఫార్మ్ చేశాక పేమెంట్ చేయొచ్చు.