Abrar Ahmed: పాకిస్తాన్ వివాదాస్పద మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ భారత యాజమాన్యంలో నడిచే ఫ్రాంచైజీకి ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. అబ్రార్‌తో పాటు దాదాపు 21 మంది పాక్ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వివిధ విదేశీ లీగ్‌లు ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) జారీ చేసింది.
సన్‌రైజర్స్ సిస్టర్ ఫ్రాంచైజీలోకి అబ్రార్:
ఇంగ్లాండ్‌లో జరిగే ది హండ్రెడ్ (The Hundred) లీగ్ వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు సిస్టర్ ఫ్రాంచైజీ.. ఈ రెండు జట్లు కూడా సన్ గ్రూప్ అధినేత్రి కావ్య మారన్ యాజమాన్యంలోనే ఉన్నాయి. వేలంలో తలపడిన ట్రెంట్ రాకెట్స్‌ను వెనక్కి నెట్టి, కావ్య మారన్ ఏకంగా £190,000 (సుమారు రూ. 2.34 కోట్లు) వెచ్చించి అబ్రార్‌ను దక్కించుకుంది. భారత యజమానికి చెందిన ఫ్రాంచైజీలో పాక్ ప్లేయర్ ని తీసుకోవడం అప్పట్లో పెద్ద రచ్చ కొనసాగింది.
సోషల్ మీడియాలో ట్రోల్స్:
ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు కూడా అబ్రార్‌కు ఎన్వోసీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో పెద్దెత్తున్న రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు అబ్రార్‌ను, అటు పీసీబీని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. గతంలో అబ్రార్ అహ్మద్ భారత్‌కు, ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, అలాంటి ప్లేయర్ ఇప్పుడు డబ్బు కోసం భారత యజమాని కింద ఆడటానికి ఎలా ఒప్పుకున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత బోర్డుతోనూ, ఐపీఎల్ యాజమాన్యాలతోనూ గొడవలు పడే పాక్ బోర్డు.. ఇప్పుడు తమ ఆటగాడిని భారత ఫ్రాంచైజీ కింద ఆడటానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
►ALSO READ | మేం ఫెయిర్‌గానే గోల్ చేశాం.. థర్డ్ అంపైర్ని ఏకిపారేసిన క్రొయేషియా బ్యూటీ!
విదేశీ లీగ్‌లకు క్యూ కట్టిన పాక్ ఆటగాళ్లు:
అబ్రార్ అహ్మద్‌తో పాటు పాకిస్తాన్‌కు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే ది హండ్రెడ్, లంకా ప్రీమియర్ లీగ్ (LPL), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), గ్లోబల్ సూపర్ లీగ్ (GSL) లాంటి టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతులు పొందారు.
* షాదాబ్ ఖాన్
* సాహిబాదా ఫర్హాన్
* అబ్దుల్లా షఫీక్
* ఉస్మాన్ తారిక్
* మహ్మద్ హారిస్
* సుఫ్యాన్ మొకీమ్
