వెలుగు స్పెషల్: కరువు కాటు పడకుండా.. కలిసికట్టుగా సాగుదాం..

వెలుగు స్పెషల్: కరువు కాటు పడకుండా..  కలిసికట్టుగా సాగుదాం..

వర్షాల కోసం ఆకాశంవైపు ఎదురుచూపులు, బీడువారిన నేలలు, ఎండిపోతున్న జలవనరులు..  ప్రకృతి విపత్తు, కరువును సూచిస్తున్నాయి.  ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు వ్యూహాత్మకంగా అడుగేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.  ప్రధానంగా కరువు కాలంలో ఆచితూచి వ్యవహరించాలి.  

తెలంగాణలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తున్న సమయంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో రూపంలో  కరువు పడగ విప్పుతోంది.  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు  ప్రజలను చైతన్యపరుస్తూ, మరోవైపు ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తోంది. 

వాతావరణంలో వచ్చే మార్పుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏర్పడే ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో గతంలో ఎన్నడూ లేనంతగా 1901 తర్వాత ఇప్పుడు అత్యంత తీవ్ర రూపంలో ఉంది. రాష్ట్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు పలు రంగాలకు సవాలుగా మారుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 11,151 గ్రామాలు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది. 

వర్షపాతం లోటు, భూగర్భ జలాలపై ఒత్తిడి, సాగునీటి అవసరాలు పెరగడం వంటి పరిణామాలు రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు  ప్రభుత్వం పలు ముందస్తు ప్రణాళికలతో ముందుకొస్తోంది. రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం, సాగులో ఉన్న పంటలను కాపాడటం, విద్యుత్ సరఫరాను సమన్వయం చేయడం, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్ర జలాశయాల్లో 54 శాతమే నిల్వలు

వర్షాకాలంలో 53 రోజులు వానలు పడాల్సి ఉండగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో కారణంగా కేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం 26 రోజులు సాధారణ వర్షాలే కురిసాయంటే దాదాపు 20 శాతం వర్షపాతం లోటు కనిపిస్తోంది. వర్షాకాలంలో సాధారణంగా పడే 773.1 మి.మీల వర్షానికి బదులు ఈసారి 615.8 మి.మీలే  కురిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలాశయాల్లో నిల్వలు 54 శాతమే ఉన్నాయి. 426.6 టీఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు బదులు 210.8 టీఎంసీల నీరే నిల్వ ఉంది. దీంతో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుతోంది.  

రాష్ట్రంలో 21,500 గుర్తింపు చెరువులుండగా వీటిలో కేవలం 550 చెరువుల్లోనే నీరు నిండి ఉంది. చెరువులకు సంబంధించి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 253.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93.51 టీఎంసీలు అంటే 36.8 శాతం నిల్వలుండడం కరువు పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు దెబ్బతినడం, పంటల ఎదుగుదల మందగించడం, దిగుబడులు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.  

ఈ పరిస్థితుల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలతో వ్యవసాయ రంగం పనులు తగ్గితే గ్రామీణ కూలీల ఆదాయంపై ప్రభావం పడే ప్రమాదముండడంతో పంటల ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

భారీగా పెరిగిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

శీతాకాలం వేసవి కాలాన్ని తలపిస్తుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో విద్యుత్ అవసరాలు తీర్చడం సవాలుగా మారింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాధారణంగా ఒక రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగముంటే ఇప్పుడు 20,000 మెగావాట్లకు చేరడం  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో  తీవ్రతను తెలియజేస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.  అయితే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో మార్కెట్లో సరఫరా పరిమితంగా ఉండే అవకాశాలున్నాయి. 

ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగంలో పొదుపు ఆవశ్యకత గురించి ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను చైతన్యపరుస్తోంది. ఇందుకు పౌరులు కూడా తమవంతు బాధ్యతగా సహకరించాలి.  రాష్ట్ర వ్యవసాయానికి కీలకమైన  కృష్ణా, గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నీటి సామర్థ్యం తగ్గింది. కృష్ణా ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270 టీఎంసీలకుగానూ 71శాతం లోటుతో 78.5 టీఎంసీల నిల్వలున్నాయి.  గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 145.7 టీఎంసీలకుగానూ 34 శాతం లోటుతో 96.0 టీఎంసీల నిల్వలున్నాయి. సింగూరు నిల్వ సామర్థ్యం  29.91 టీఎంసీలకు గానూ 3.924 టీఎంసీలున్నాయి.  ఈ నేపథ్యంలో వ్యవసాయ సాగుపై నీటి కొరత ప్రభావం అధికంగా ఉండబోతోంది.  

ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యతివ్వాలి 

రాబోయే యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యతివ్వాలి.  వర్షాభావం వల్ల వ్యవసాయ పనులు తగ్గితే గ్రామీణ కుటుంబాల ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతమున్న 125 పనిదినాలకు అదనంగా మరో 50 రోజులు పని కల్పించాలి. 

దీంతో గ్రామీణ కుటుంబాలకు ఆదాయం అందించడంతో పాటు చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులు చేపట్టవచ్చు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. రాజకీయాలకు అతీతంగా అందరం చేయిచేయి కలిపి రాష్ట్ర  ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తూ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోను ఎదుర్కోవాలి.
 

320 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

రాష్ట్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోతో నెలకొంటున్న పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు మంత్రులతో, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం భూగర్భ జలాల్లో కొరత ఏర్పడి 612 మండలాలకుగాను 18 జిల్లాల పరిధిలోని 320 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జలాలు, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల నుంచి సమగ్రమైన వివరాలు సేకరించి వర్షాభావ తీవ్రతను అంచనా వేయడంతోపాటు,  ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలను గుర్తించి ప్రభుత్వం రానున్న 10 నెలలు కీలకం కావడంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలపై సమగ్రమైన దృష్టి సారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తోంది.  పంటలు చేతికొచ్చేవరకు అవసరమైన నీటిని అందించేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా  ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తోంది. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు

 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.