పోక్సో కేసులో టీచర్ కు 17 ఏండ్ల జైలు శిక్ష .. పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో టీచర్ కు 17 ఏండ్ల జైలు శిక్ష .. పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

పెద్దపల్లి, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి17 ఏండ్లు జైలు శిక్ష, రూ. 1.50 లక్షల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్​ట్రాక్​కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ 2013లో అదే స్కూల్ కు చెందిన  టెన్త్ క్లాస్ విద్యార్థినిని భయపెట్టి లొంగదీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.  అనంతరం 2017లో ఆమెకు పెండ్లి అయినా కూడా మధుకర్​మరోసారి ఆమెను లొంగదీసుకునేందుకు  బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఆమె వినకపోకవడంతో గతంలో వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను  బాధితురాలి భర్తకు పంపిం చా డు. దీంతో అతను పెద్దమనుషుల సమక్షంలో భార్యకు విడాకులు ఇచ్చాడు. అయినా మధుకర్​ వేధింపులు ఆపకపోవడంతో భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసి  నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం మధుకర్​నేరస్తుడని తేలడంతో పెద్దపల్లి ఫాస్ట్​ట్రాక్​కోర్టు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై ప్రజా సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.