Peddi : శృతి హాసన్, జాన్వీతో చరణ్ ఊరమాస్ స్టెప్పులు.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్!

 Peddi : శృతి హాసన్, జాన్వీతో చరణ్ ఊరమాస్ స్టెప్పులు.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ స్పీడప్ చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన ప్రోమో సాంగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.

స్పెషల్ సాంగ్ రెడీ..

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ “హెల్లాళ్లాళ్లో” (Hellallallo) అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు. ఇందులో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ వేసిన ఊరమాస్ స్టెప్పులు నెట్టింట మంటలు రేపుతున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన హై-వోల్టేజ్ బీట్స్‌కు.. రక్షితా సురేష్ గాత్రం, అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ తోడవడంతో ఈ పాట ఇన్స్టంట్‌గా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

భోపాల్‌లో రెహమాన్ లైవ్ కన్సర్ట్!

ఈ క్రేజీ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను మే 23న భోపాల్‌లోని భేల్ (BHEL) దసరా మైదానంలో నిర్వహించబోయే #PEDDIKiAawaz మ్యూజికల్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకు రండి అంటూ రామ్ చరణ్ స్వయంగా ఓ స్పెషల్ వీడియో ద్వారా అభిమానులను ఆహ్వానించారు. ఈ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

సరికొత్త రికార్డులు!

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రామ్ చరణ్ క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మల్టిపుల్ అవతారాల్లో ఊరమాస్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేశారు. ఈ చిత్రంలోని “చికిరి చికిరి” సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో, “రాయ్ రాయ్ రా రా” సాంగ్ 68 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ‘పెద్ది’ మేనియా ఇప్పుడే మొదలైంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే $100K మార్కును దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ALSO READ : బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న‘దృశ్యం 3’

వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 3, 2026న వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌తో..  జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘పెద్ది’ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది..