‘పెద్ది’ నైట్ యాక్షన్.. రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్‌‌‌‌

‘పెద్ది’ నైట్ యాక్షన్.. రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్‌‌‌‌

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’.  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. డీవోపీ రత్నవేలు ‘పెద్ది’  సెట్స్ నుంచి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ మూమెంట్‌‌‌‌ను షేర్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ సినిమాకు మేజర్ హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ స్టిల్‌‌‌‌లో రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్‌‌‌‌లో కనిపించాడు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.   మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది రామ్ చరణ్   పుట్టినరోజు సందర్భంగా  మార్చి 27న విడుదల కానుంది.