నెక్స్ట్ లెవల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌తో పెద్ది: ఫైట్ మాస్టర్ నభాకాంత్

నెక్స్ట్ లెవల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌తో పెద్ది: ఫైట్ మాస్టర్ నభాకాంత్

‘పుష్ప’ చిత్రంతో స్టంట్ కొరియోగ్రాఫర్‌‌‌‌గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న  నభాకాంత్.. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఇందులో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లు నెక్స్ట్ లెవల్‌‌‌‌లో ఉంటాయని చెప్పాడు. జూన్ 4న సినిమా రిలీజ్ సందర్భంగా ఫైట్ మాస్టర్ నభాకాంత్ మాట్లాడుతూ ‘‘పుష్ప 2’ జరుగుతున్నప్పుడే బుచ్చిబాబు ‘పెద్ది’లోని ఇంట్రడక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పారు. అది యాక్షన్ సీక్వెన్స్ కాదు కానీ యాక్షన్‌‌‌‌లా ఉండాలని అన్నారు. చాలా సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌గా అనిపించింది. 

ఆ సీక్వెన్స్ కోసం గ్లింప్స్‌‌‌‌లో చూపించిన బ్యాటింగ్ స్టైల్ షాట్ కంపోజ్ చేశా. అది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది.  ఇంట్రో దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఎపిసోడ్ చాలా ఫ్రెష్‌‌‌‌గా ఉంటుంది. కంటెంట్ చాలా పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటుంది. చరణ్ గారు ప్రేక్షకులను ‘పెద్ది’ వరల్డ్‌‌‌‌లోకి తీసుకెళ్లిపోతారు. ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌‌‌‌లో ఉంటుంది.

సినిమాలో యాక్షన్ మరో లెవెల్‌‌‌‌లో ఉంటుంది.  ఇందులో మా గురువులు  రామ్ -లక్ష్మణ్ మాస్టర్లు పోలీస్ స్టేషన్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఒక ఎపిసోడ్ చేశారు. కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్  నాన్నగారు శ్యామ్ కౌశల్‌‌‌‌ను సంప్రదించాం. ఇందులో నేషనల్ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలు ఉంటాయి. చాలా నేచురల్‌‌‌‌గా ఆ సీక్వెన్స్‌‌‌‌ను చిత్రీకరించాం. 

ఇందులో దివ్యేందుశర్మ, శివ రాజ్‌‌‌‌కుమార్ గారి‌‌‌‌తో కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లు ఉన్నాయి. ఇందులోని ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. ప్రస్తుతం ది ప్యారడైజ్, రౌడీ జనార్ధన,  సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి గారి సినిమా, చిరంజీవి గారి సినిమా చేస్తున్నాను’ అని చెప్పాడు.