హైదరాబాద్‌లో పెలికాన్ సిగ్నల్స్.. ఈజీగా రోడ్డు దాటోచ్చు

హైదరాబాద్‌లో పెలికాన్ సిగ్నల్స్.. ఈజీగా రోడ్డు దాటోచ్చు

హైదరాబాద్‌లో రోడ్డు క్రాస్ చేయడం అంటే మాములు విషయం కాదు.  బిజీ ట్రాఫిక్‌లో రోడ్లు దాటుతూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు.   అయితే ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీసులు కలిసి నగరంలోని పలు చోట్ల పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ ఏరియాలో ఏర్పాటు చేసిన   పెలికాన్ సిగ్నల్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు.

ఇంతకీ పెలికాన్ సిగ్నల్ అంటే ఎంటీ ?

సాధరణంగా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు.. గ్రీన్  బటన్  పడితే ముందుకు వెళ్లాలి. రెడ్ బటన్ పడితే ఆగిపోవాలి.  ఇప్పుడు కొత్తగా  పెలికాన్ సిగ్నల్ అంటే  ఏంటంటే.. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని మాన్యువల్‌గా కంట్రోల్ చేస్తారు. పెలికాన్‌ సిస్టం ఏర్పాటుతో ట్రాఫిక్‌ సిబ్బందితో అవసరం లేకుండా పాదచారులే కాలిబాటలో స్తంభానికి ఏర్పాటు చేసిన సిస్టమ్‌పై బటన్ నొక్కవచ్చు.

 బటన్‌ నొక్కగానే అప్పటి వరకు గ్రీన్‌గా ఉన్న సిగ్నల్‌ రెడ్‌కు మారుతుంది. పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఇది 15 సెకన్ల పాటు ఉంటుంది. ఈ సమయం పూర్తికాగానే దానంతట అదే వాహనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ చూపుతుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్లు బటన్ నొక్కుండా.. ప్రతీ సిగ్నల్ వద్ద ఒక వలంటీర్‌ను నియమించారు స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద ఉండే ప్రధాన కూడళ్లలో ఈ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ట్యాంక్‌బండ్ మైత్రీవనం, అమీర్‌పేట్ క్రాస్‌రోడ్స్, బొటానికల్ గార్డెన్ సిగ్నల్, గచ్చిబౌలి, మాదాపూర్‌, శిల్పారామం జంక్షన్ వంటి ప్రధాన జంక్షన్‌లలో ఈ తరహా సిగ్నల్స్ ఉన్నాయి.