దీప్కే లాంటివారు అందరినీ కన్ఫ్యూజ్‌‌‌‌ చేస్తారు.. కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ 

దీప్కే లాంటివారు అందరినీ కన్ఫ్యూజ్‌‌‌‌ చేస్తారు.. కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ 

బెర్లిన్: విదేశాల్లోని మన ప్రతిభను స్వదేశానికి రప్పించేందుకు ఏదైనా ప్రభుత్వ పథకం తెస్తే.. అభిజీత్ దీప్కే లాంటి వ్యక్తులు ముందుకొచ్చి అనవసర రాద్ధాంతం చేస్తారని కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు వచ్చి మన మతి పోగొడతారని, మనందరినీ కన్ఫ్యూజ్‌‌‌‌ చేస్తారని వ్యాఖ్యానించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌‌‌‌లో భారతీయ సైన్స్, టెక్నాలజీ పరిశోధక విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

విదేశాల్లో ఉన్న పరిశోధకులను ఆకర్షించేందుకు చైనా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం తరహాలోనే భారత్ కూడా ఒక పథకాన్ని తేవాలని ఓ విద్యార్థి సూచించగా.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్‌‌‌‌‌‌‌‌ అభిజీత్ దీప్కేను లక్ష్యంగా చేసుకొని గోయల్  కామెంట్స్‌‌‌‌ చేశారు.‘‘ఆ ఆలోచన మంచిదే కావచ్చు.. కానీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంది.

రేపు మనం అలాంటి నిధులతో పథకం ప్రకటిస్తే.. విద్యార్థులకు ఫండింగ్ ఇవ్వడం, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు మంజూరు చేయడం ప్రభుత్వం బాధ్యత కదా, సొంతంగా ఎందుకు చేయాలి?  అంటూ దీప్కే లాంటి వారు ప్రశ్నలతో గందరగోళం సృష్టిస్తారు. అందుకే ఆచితూచి విధానాలు రూపొందించాల్సి వస్తుంది’’  అని పేర్కొన్నారు.

స్వదేశానికి సేవ చేసేందుకు వచ్చేయండి..!

నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అద్భుతమైన భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. వారిని వెనక్కి తేవాలి కానీ, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి” అని అన్నారు. డబ్బు కోసమే కాకుండా కన్నతల్లి లాంటి స్వదేశానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని విద్యార్థులకు గోయల్‌‌‌‌ పిలుపునిచ్చారు.