ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో త్వరగా ఫేమస్ అవుతారు!

ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో త్వరగా ఫేమస్ అవుతారు!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ అవ్వాలని కోరుకుంటున్నారు. కొందరు రీల్స్ ద్వారా, మరికొందరు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. అయితే, సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి జనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా..? అవేంటో ఇప్పుడు చూద్దాం...

నెంబర్ 3: మాటకారితనం
ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30వ తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 3. ఈ సంఖ్యకు అధిపతి గురు గ్రహం. ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు. వీరి మాట తీరు ఇతరులను త్వరగా ఆకట్టుకుంటుంది. వీరు మోటివేషనల్ వీడియోలు లేదా ఏదైనా నేర్పించే (Educational) వీడియోలు చేస్తే త్వరగా వైరల్ అవుతారు.

నెంబర్ 5: తెలివితేటలు
5, 14 లేదా 23వ తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 5. దీనికి అధిపతి బుధ గ్రహం. బుధుడు అంటేనే తెలివితేటలు ఇంకా కమ్యూనికేషన్‌కు గుర్తు. ప్రత్యేకత ఏంటంటే   వీరు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు. కొత్త విషయాలను ఇతరులకు చెప్పడంలో వీరు దిట్ట. వీరు ఎంటర్టైన్మెంట్ లేదా ఫిట్‌నెస్ సంబంధిత వీడియోలు చేస్తే మంచి గుర్తింపు వస్తుంది.

నెంబర్ 6: అందం & ఆకర్షణ
6, 15 లేదా 24వ తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 6. దీనికి అధిపతి శుక్ర గ్రహం. ప్రత్యేకత ఏంటంటే  వీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. కెమెరా ముందు వీరు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. ఫ్యాషన్, బ్యూటీ టిప్స్, లైఫ్‌స్టైల్ ఇంకా సినిమా కంటెంట్‌కు వీరు పర్ఫెక్ట్ సెట్ అవుతారు.

నెంబర్ 1: సొంత స్టైల్
1, 10, 19 లేదా 28వ తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 1. దీనికి అధిపతి సూర్యుడు. ప్రత్యేకత ఏంటంటే వీరు ఇతరులను కాపీ కొట్టడానికి ఇష్టపడరు. సొంతంగా కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్ (Unique Style) చూపిస్తూ వీడియోలు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు.  గమనిక ఇక్కడ 28 కూడా వర్తిస్తుంది. 

ముఖ్య గమనిక:
సంఖ్యాశాస్త్రం అనేది ఒక అంచనా మాత్రమే. కేవలం పుట్టిన తేదీని నమ్ముకుని కూర్చుంటే సక్సెస్ రాదు. సోషల్ మీడియాలో రాణించాలంటే కష్టపడే తత్వం, క్రమం తప్పకుండా వీడియోలు చేయడం, కొత్తదనం చాలా ముఖ్యం. ఏ నెంబర్ వారైనా సరే, ప్రతిభ ఉంటే కచ్చితంగా స్టార్ అవ్వొచ్చు!