చూస్తేనే వణుకు.. అలాంటి కోబ్రాకు ముద్దులా

చూస్తేనే వణుకు.. అలాంటి కోబ్రాకు ముద్దులా

ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాంటిది కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని కంట పడితే మరణం ఖాయం. అందుకే కోబ్రా అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అయినప్పటికీ, కొంతమంది మాత్రం వాటితో స్నేహంగా ఉంటూ ఆడుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ తరహాలోనే కింగ్ కోబ్రా పట్లపై అమిత ప్రేమను చూపిస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిక్‌త్రాంగ్లర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో కింగ్ కోబ్రాతో ఒక వ్యక్తి గేమ్ ఆడుతున్నట్లు చూడవచ్చు. ఆ వ్యక్తి విషపూరితమైన నాగుపామును దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టడం కూడా గమనించవచ్చు. ఈ కింగ్ కోబ్రా దాదాపు 12 అడుగుల పొడవున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ విషపు జంతువుతో వ్యక్తి చేసే చర్యలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని ధైర్యాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు 2.76 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

https://www.instagram.com/reel/Cr-_jmFNgUd/?utm_source=ig_embed&ig_rid=2c1dc97f-15d9-464d-b9fa-c4bc5c68e43f