హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్లలో గురువారం (ఆగస్టు 10) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పెట్రోల్,డీజిల్ రేట్లు రెండూ స్థిరత్వాన్ని కొనసాగించినప్పటికీ వివిధ నగరాల్లో రోజువారీ ధరల హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో గురువారం (ఆగస్టు 10, 2023)న  లీటరు పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 లీటరు.జనవరి 24 నుంచి ధరలు స్థిరంగా  ఉన్నాయి. హైదరాబాద్‌లో వరుసగా గత 7 నెలలుగా రేటు మారలేదు.  
 దేశంలోని మిగత మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా..డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ విలువ లీటరుకు రూ. 92.76.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ OMCలు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ ధర, డీజిల్ ధరలను సవరిస్తాయి.