పీఎఫ్ ఆర్ డీఏలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24

పీఎఫ్ ఆర్ డీఏలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్​డీఏ) ఆఫీసర్ గ్రేడ్ 'ఏ' (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 03 నుంచి సెప్టెంబర్ 24 వరకు కొనసాగుతుంది.

పోస్టు పేరు: ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్)

మొత్తం ఖాళీలు: 30.

విభాగాల వారీగా ఖాళీలు: జనరల్ 25 (ఎస్సీ–4, ఎస్టీ–2, ఓబీసీ–7, ఈడబ్ల్యూఎస్–3, యూఆర్/ జనరల్–9), రీసెర్చ్ 2 (ఎస్సీ–1, యూఆర్/ జనరల్–1), ఆక్చువరీ 2 (యూఆర్/ జనరల్ –2), ఆఫీషియల్ లాంగ్వేజ్ (రాజ్యభాష) 1 (ఓఈసీ–1). 

ఎలిజిబిలిటీ

జనరల్: ఏదైనా గుర్తింపు పొందిన డిసిప్లిన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. లేదా లాలో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) కలిగి ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఏసీఏ లేదా ఎఫ్​సీఏ అర్హత సాధించి ఉండాలి. లేదా ఐసీఎంఏఐ నుంచి ఏసీఎంఏ లేదా ఎఫ్​సీఎంఏ అర్హత కలిగి ఉండాలి. లేదా సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి సీఎఫ్ఏ డిగ్రీ పొంది ఉండాలి.

రీసెర్చ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ/  పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 
ఆక్చువరీ: ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్చువరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) నిర్వహించే పరీక్షల్లోని మొత్తం ఏడు 'కోర్ ప్రిన్సిపుల్స్' సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా మినహాయింపు పొంది ఉండాలి.

ఆఫీషియల్ లాంగ్వేజ్:  డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండటంతోపాటు హిందీ లేదా హిందీ ట్రాన్స్​లేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా అభ్యసించి సంస్కృతం, ఇంగ్లిష్, ఎకనామిక్స్ లేదా కామర్స్​లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా ఇంగ్లిష్, హిందీ (లేదా హిందీ ట్రాన్స్​లేషన్) రెండింటిలోనూ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయసు: 2026, జులై 31 నాటికి 30 ఏళ్లు మించకూడదు(1996, ఆగస్టు 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 3.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. 
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24. 
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్ I  ఆన్​లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్ II  ఆన్​లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 ఫేజ్ I  ఆన్​లైన్ ఎగ్జామినేషన్: అక్టోబర్ 15.
ఫేజ్ II  ఆన్​లైన్ ఎగ్జామినేషన్: నవంబర్ 20.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.pfrda.org.in/careersను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్

పీఎఫ్‌ఆర్‌డీఏ ఆఫీసర్ గ్రేడ్ 'ఏ' నియామక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది.

ఫేజ్ I - ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష

కంప్యూటర్ బేస్డ్​ విధానంలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. 

పేపర్ 1 (అన్ని  స్ట్రీమ్‌ల వారికి కామన్): ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్ అంశాలపై 90 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి.
పేపర్ 2 (స్ట్రీమ్- స్పెసిఫిక్  సబ్జెక్ట్): సంబంధిత స్ట్రీమ్‌కు సంబంధించిన సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ దశలో వచ్చిన మార్కులను కేవలం ఫేజ్ IIకి అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేయడానికి మాత్రమే పరిగణిస్తారు. ఫైనల్ సెలెక్షన్​లో కలపరు. 

ఫేజ్  -II ఆన్‌లైన్ పరీక్ష

ఇందులో డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ పేపర్​కు 1/3వ వంతు, ఆబ్జెక్టివ్ పేపర్​కు 2/3వ వంతు మార్కుల వెయిటేజీ కేటాయించారు. 
పేపర్ 1: డిస్క్రిప్టివ్ ఇంగ్లిష్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 3 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. 
పేపర్ 2: అభ్యర్థులు అప్లై చేసుకున్న సబ్జెక్ట్ లేదా స్ట్రీమ్‌కు సంబంధించిన అంశాల నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. పేపర్ 2లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. 
ఖాళీల సంఖ్యకు ఐదు రెట్ల మంది అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఫేజ్ III  కోసం షార్ట్​లిస్ట్ చేస్తారు.

ఫేజ్ III - ఇంటర్వ్యూ

ఫేజ్ IIలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లి భాషల్లో హాజరుకావచ్చు.