Hrithik Roshan: హ్రితిక్ రోషన్కు తీవ్ర గాయాలు.. వార్2 మరింత ఆలస్యం

Hrithik Roshan: హ్రితిక్ రోషన్కు తీవ్ర గాయాలు.. వార్2 మరింత ఆలస్యం

బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్(Hrithik Roshan) రోషన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కారణం తెలియదు కానీ, ఆయన తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడుముకి పట్టీతో, రెండు చేతుల కింద క్రచెస్‌ వేసుకొని కనిపించారు. దీంతో హ్రితిక్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తే హ్రితిక్ కి బలంగానే గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన హ్రితిక్ సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చాడు. 

గతంలో మీకు ఎప్పుడైనా వీల్ చైర్, క్రచెస్‌ వాడాల్సిన అవసరం వచ్చిందా? అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? గాయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు హ్రితిక్. దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తొందరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి వాళ్ళు కూడా హ్రితిక్ తొందరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక హ్రితిక్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వార్2 సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరెకెక్కిస్తున్న ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా హ్రితిక్ గాయాల కారణంగా ఇంకా మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.