అదృష్టం అంటే వీళ్లదే.. సముద్రం ఒడ్డున కూలిన విమానం.. నిమిషం ఆలస్యం అయి ఉంటే సముద్రంలో గల్లంతు

అదృష్టం అంటే వీళ్లదే.. సముద్రం ఒడ్డున కూలిన విమానం.. నిమిషం ఆలస్యం అయి ఉంటే సముద్రంలో గల్లంతు

భూమిపై నూకలు ఉంటే యముడు కూడా ఏమీ చేయలేడు అన్నట్లు.. అదృష్టం ఉంటే చావు అంచుల నుంచి కూడా బయటపడొచ్చు.. సోమాలియాలో జరిగిన విమానం ప్రమాదం చూస్తే అచ్చం ఇలాగే అనుకుంటున్నారు జనం. ఆ ఫొటోలు, వీడియోలు చూసి.. వీళ్ల అదృష్టం బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్లయిట్ యాక్సిడెంట్ నుంచి 55 మంది సురక్షితంగా బయటపడటం.. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. ఎవరికీ  ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమాలియా విమాన ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

సోమాలియా దేశం మొగడిషులోని అడెన్ అబ్దుల్లె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 మంది ప్రయాణికులు.. ఐదుగురు సిబ్బందితో విమానం బయలుదేరింది. మొగడిషు నుంచి గాల్కాసియోకు వెళుతుంది. ఎయిర్ పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత.. ఫ్లయిట్ లో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలెట్లు.. వెంటనే ఎయిర్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే వెనక్కి రావాలని వాళ్లకు సమాచారం.. దీంతో 15 నిమిషాల జర్నీ తర్వాత.. యూ టర్న్ తీసుకున్న విమానం.. మొగడిషు ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. 

సరిగ్గా ఈ సమయంలో విమానం అదుపు తప్పింది. ఎయిర్ పోర్టులో కాకుండా.. దగ్గరలో ఉన్న సముద్రం ఒడ్డున అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సముద్రం ఒడ్డున.. అలల మధ్య దిగింది విమానం. బలవంతంగా ల్యాండ్ కావటంతో.. విమానం రెక్కలు విరిగిపోయాయి. విమానం దెబ్బతిన్నది. బీచ్ పక్కనే ఎయిర్ పోర్టు కావటంతో.. ఎమర్జెన్సీ టీమ్స్ వెంటనే అక్కడికి చేరుకున్నాయి. విమానంలోని 55మందిని రక్షించారు.

విమానం ఒక్క నిమిషం ఆలస్యం అయినా.. సముద్రంలో కూలిపోయే అవకాశాలు ఉండేవి. యూ టర్న్ తీసుకున్న తర్వాత.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సిన విమానం.. సమీపంలోని సముద్రం ఒడ్డున కూలిపోయింది. ఒక్క నిమిషం ఆలస్యం అయ్యి ఉంటే విమానం సముద్రంలో కూలిపోయేదని.. పెను ప్రమాదం జరిగేదంటున్నారు అధికారులు. 

విమాన ప్రమాదంపై సోమాలియా దేశం ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. విచారణ జరుగుతుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం అంటున్నారు. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు.

ఏదిఏమైనా అదృష్టం అంటే వీళ్లదే అంటున్నారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు అందరూ ప్రాణాలతో.. వారి వారి లగేజీలతో సహా హ్యాపీగా బయటకు రావటం అంటే మాటలా ఏంటీ...