ప్లాంట్‌‌ మాన్కు మంచి రెస్పాన్స్.. చిన్న సినిమాకి పెద్ద విజయం

ప్లాంట్‌‌ మాన్కు మంచి రెస్పాన్స్.. చిన్న సినిమాకి  పెద్ద విజయం

చంద్రశేఖర్‌‌, సోనాలి జంటగా కె.సంతోష్‌‌బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్‌‌ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘ప్లాంట్‌‌ మాన్’. పన్నా రాయల్ నిర్మించిన ఈ  చిత్రం జనవరి 5న  విడుదలైంది. సినిమాకొస్తున్న  రెస్పాన్స్‌‌ను తెలియజేసేందుకు టీమ్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించింది. చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘మా చిత్రానికి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతికి  కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌‌ చేయదగ్గ సినిమా ఇది’ అన్నాడు. 

మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పింది సోనాలి. చిన్న సినిమాకి  పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని చెప్పాడు దర్శకుడు కె.సంతోష్‌‌బాబు. ఈ  చిత్రానికి మంచి రిజల్ట్ వచ్చిందని, ఇలాంటి రెస్పాన్స్‌‌ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్‌‌ చేస్తానని నిర్మాత పన్నా రాయల్ చెప్పారు. బేబి ప్రేక్షిత, అక్కం బాలరాజు, అశోక్‌‌వర్థన్‌‌, రచయిత సాయికృష్ణ, తడివేలు,  బాలరాజు, వెంకట్‌‌ తదితరులు పాల్గొన్నారు.