"నాటు నాటు" డ్యాన్స్కు ప్రధాని మోడీ కితాబు

"నాటు నాటు" డ్యాన్స్కు ప్రధాని మోడీ కితాబు

RRR ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ముఖ్యంగా ఈ సినిమా అంటేనే గుర్తుకొచ్చేది నాటు నాటు సాంగ్. ఈ పాట ప్రపంచంలోని ముఖ్యమైన అవార్డులు అందుకుంటోంది. అయితే ముఖ్యంగా సాంగ్ లో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ స్టెప్స్ హైలెట్. వీరిద్దరి స్టెప్స్ సోషల్ మీడియాను హోరెత్తించింది. ఈ పాటపై ఎన్నో కవర్‌ సాంగ్‌లు విడుదలై శభాష్ అనిపించుకున్నాయి. 

నాటు నాటు పాటపై  తాజాగా చేసిన కవర్‌సాంగ్‌ శభాష్ అనిపించుకుంటోంది. దీనికి ఏకంగా  ప్రధాని నరేంద్రమోడీ సైతం కితాబిచ్చారు.  కొరియాలోని భారత్‌ సిబ్బందితో కలిసి కొరియన్‌ రాయబారి చాంగ్‌ జె.బోక్‌ నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను కొరియా ఇండియన్‌ ఎంబసీ  ట్విటర్‌లో షేర్‌ చేసింది. అయితే  ఈ ట్వీట్‌ను  ప్రధాని మోడీ  రీట్వీట్‌ చేశారు. డ్యాన్స్‌ బాగుంది... టీం వర్క్‌ కనిపిస్తోంది... అని కామెంట్ చేశారు.  ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మోడీ ట్వీట్ వైరల్ గా మారింది.