మోడీ బలమైన శత్రువు.. ఆయనను ప్రేమతో ఓడిస్తా

మోడీ బలమైన శత్రువు.. ఆయనను ప్రేమతో ఓడిస్తా

తిరునల్వేలి: ప్రధాని మోడీ తమకు బలమైన శత్రువని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రత్యర్థులను దారుణంగా అణచివేస్తారని.. అహింస, ప్రేమ ద్వారా మోడీని ఓడిస్తామని రాహుల్ చెప్పారు. బీజేపీని ఓడించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం తిరునల్వేలిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో ‘ఎడ్యుకేషనల్ మీట్‌’లో విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ‘ధనబలం ఉన్న, ప్రత్యర్థులను అణచివేసే శత్రువుతో పోరాడుతున్నాం. గతంలోనూ పోరాడాం. మోడీ కంటే బలంగా ఉండే బ్రిటీష్ సామ్రాజ్యం పైనే పోరాడాం. బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమేశాం. మోడీని కూడా నాగ్‌‌పూర్‌ (ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం)‌కు తరిమి కొడతాం’ అని రాహుల్ స్పష్టం చేశారు.