కూకట్‌పల్లిలో రేవ్‌ పార్టీ.. 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాల అరెస్ట్

కూకట్‌పల్లిలో రేవ్‌ పార్టీ.. 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాల అరెస్ట్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

కూకట్‌పల్లి వివేకానంద నగర్‌‌లోని ఓ ఇంట్లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు నిన్న రాత్రి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీస్‌ టీమ్‌ ఆ ఇంటిపై రైడ్ చేశారు. హుక్కా పాట్స్ లో హుక్కా పీలుస్తూ, మద్యం తాగుతూ రేవ్ పార్టీలో యువకులు వీరంగం సృష్టిస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 44 మంది యువకులను, వారితోపాటు ఉన్న ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడిన వారంతా హోమో సెక్స్‌వల్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్, హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది యువకులు కలిసి ప్రతి వీకెండ్‌ ఇలా పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలను ఆర్గనైజ్ చేస్తున్న రాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.