ఏపీలో MPTC, ZPTCలకు నామినేషన్లు... వైసీపీ నేతల అరెస్ట్ 

ఏపీలో MPTC, ZPTCలకు నామినేషన్లు... వైసీపీ నేతల అరెస్ట్ 

ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు కూడా ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. గురువారం ( అక్టోబర్ 22 ) ఎంపీటీసీ, జెడ్పీటీసి నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కడప వైసీపీ ఆఫీసు దగ్గర 

కడపలో ఎంపిటీసీ, జెడ్పిటీసి అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు వెళ్ళడానికి సిద్దమవుతున్న ఎంపీ అవినాష్ రెడ్డిని, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ ఆఫీసు నుంచి వెళ్ళడానికి సిద్దమవుతున్న ఇద్దరు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో వైసీపీ ఆఫీసు దగ్గర భారీ పోలీసులు మోహరించారు.

అనంతపురంలో హౌస్ అరెస్టులు

అనంతపురంలో కూడా పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించడానికి వెళ్తున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని, శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ ను హౌస్ అరెస్ట్ చేశారు.

దీంతో పాటు మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పూలవర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. 

తిరుపతిలో 

తిరుపతి జిల్లా వైసీపీ నేతలు కలెక్టరేట్ దగ్గర బుధవారం చేపట్టిన నిరసనలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎస్సై ఫిర్యాదుతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు 15 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.