కషఫ్పై పీడీ యాక్ట్.. భారీ బందోబస్తు మధ్య అరెస్ట్

కషఫ్పై పీడీ యాక్ట్.. భారీ బందోబస్తు మధ్య అరెస్ట్

విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కషఫ్ పై  పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తల తీసేస్తామంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన కామెంట్స్ చేశాడు. కషఫ్ కామెంట్స్ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్న పోలీసులు అతడిపై పీడియాక్ట్ నమోదు చేశారు. ఓల్డ్ మలక్పేట్లోని కషఫ్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

కాగా గత వారం రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మునావర్ ఫారుఖి షోను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ విడుదల చేసిన దుమారం రేపింది. వీడియోలో ఓ వర్గాన్ని కించపరిచేలా కామెంట్స్  చేశారని..దానివల్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని పోలీసులు చెప్పారు. కషఫ్ గతంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తగా పనిచేశాడు. అయితే గత ఐదేళ్లుగా అతనికి పార్టీతో ఎలాంటి సంబంధంలేదని ఎంఐఎం అధికార ప్రతినిధి ప్రకటించారు.