సలార్ టికెట్ల కోసంఎగబడ్డ ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్!

సలార్ టికెట్ల కోసంఎగబడ్డ ఫ్యాన్స్.. పోలీసుల లాఠీఛార్జ్!

ప్రస్తుతం ఇండియా వైడ్గా వినిపిస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే..అది ప్రభాస్ సలార్. ఏకంగా సలార్.. సలార్..అంటూ ఆడియన్స్ లో సలార్ నామస్మరణ వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న హై ఓల్టేజ్ మూవీ..మరో రెండ్రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతుంది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల ముందు సలార్ స్పెషల్ షో టికెట్ల కోసం బారులు కడుతున్నారు. అంతేకాకుండా టికెట్ల కోసం క్యూ లైన్స్లో నిలబడి ఎగబడిపోతున్నారు.

లేటెస్ట్గా KPHB లోని ఓ థియేటర్ లో టికెట్ల కోసం ఫ్యాన్స్ కోసం ఎగబడగా..వారిపై పోలీసులు లాటి ఛార్జ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసుల తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకు రాని హైప్ సలార్ సినిమాకు వచ్చింది. నిజానికి బాహుబలి తరువాత ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా టికెట్స్ కోసం హైద్రాబాద్ లోని ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా నడుస్తోంది. టికెట్స్ దొరికిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ స్టేటస్ పెట్టుకోగా.. దొరకని వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.