బంజారాహిల్స్ లోని మసాజ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు

బంజారాహిల్స్ లోని మసాజ్ సెంటర్లో అశ్లీల కార్యకలాపాలు

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఓ మసాజ్ సెంటర్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. మసాజ్ పేరుతో అశ్లీల కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆరుగురు అమ్మాయిలతో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం, నిఘా సహకారంతో దాడులు నిర్వహించారు పోలీసులు.  మసాజ్ సెంటర్ లో పని చేస్తున్న అరెస్టయిన అమ్మాయిలంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారేనని పోలీసులు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ అమ్మాయిల చేత మసాజ్ సెంటర్ యజమానులు ఈ పాడు పనులు చేస్తున్నారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.