హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలో సొంతిల్లు లేని నిరుపేదలు, ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఫస్ట్ ప్రయార్టీ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కొత్తపల్లి – హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన చిగురుమామిడి, సుందరగిరి ప్రజలతోపాటు, మల్లెచెట్టు చౌరస్తా నుంచి జనగామ రోడ్డు (అక్కన్నపేట మీదుగా) విస్తరణలో ఇండ్లు కోల్పోయిన అర్హులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
చౌటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములిచ్చి ఇల్లు లేని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, నిజమైన పేదలకు, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ముందుగా న్యాయం చేస్తామన్నారు.
'స్టీల్ బ్యాంక్' భేష్..
హుస్నాబాద్ నియోజకవర్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ‘స్టీల్‌బ్యాంక్’ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్ అభినందించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక లేఖ రాశారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ పాత్రలను వినియోగించేల స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని కొనియాడారు. ఈ కార్యక్రమంతో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
