
బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde)రెమ్యూనరేషన్ రేంజ్ ఒక్క సారిగా ఢమాల్ న పడిపోయిందట. ఫాంలో ఉన్నంత కాలం ఈ అమ్మడు భారీగానే పారితోషికం తీసుకుంది. ఒక్కో సినిమాకి మూడు కోట్లు ఛార్జ్ చేసిన సందర్భాలున్నాయి. అదనంగా సొంత ప్లైట్ వేసుకుని రావడం..ఆ ఖర్చులు నిర్మాత నెత్తిన వేయడం..ఇంకా అదనపు సిబ్బంది ఇలా రేంజ్ లో మెయింటెన్ చేసింది.
ఆమె రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లా కుప్ప కూలిపోతోందట. ఇప్పటివరకూ ఒక్కో సినిమాకి మూడు కోట్లు అందుకున్న భామ ఒక్కసారిగా కోటిరన్నరకు పడిపోయిందట. అంతకు మించి తక్కువ ఇచ్చినా సరే సైన్ చేయడానికి సిద్దంగానే ఉందని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. స్టార్ హీరోలే అవసరం లేదని..మిడ్ రేంజ్ హీరోలైనా సినిమాలు చేయడానికి సిద్ధమనే సంకేతాలిస్తోందట.
ఒకప్పుడు ఓ రేంజ్ లో సందడి చేసిన అమ్మడికి ఇప్పుడు తెలుగులో అవకాశాలే రావడం లేదు. కోలీవుడ్ లోనూ అంతేనట. ఇందకు ప్రత్యేక కారణాలున్నాయట.ఆ మధ్య ఓ సినిమా విషయంలో అమ్మడు చేసిన పనికి ఇక్కడి నిర్మాతలంతా ఒక్కటయ్యారని తెలుస్తోంది. పరిశ్రమ నుంచి కూడా ఈ రకమైన అంశమే తెరపైకి వస్తోంది.అదే నిజమైతే బుట్టబొమ్మకు అవకాశాలు రావడం కష్టమే! ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో పూజా నటిస్తోంది.