బుట్ట బొమ్మ పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆమె సినిమాలకు గురించి కాదు.. వ్యక్తిగత జీవితం గురించి. గత కొన్నాళ్లుగా తన రిలేషన్ షిప్స్ విషయంలో చాలా గోప్యంగా ఉంటూ వస్తుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో డేటింగ్‌లో ఉందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.
హీరోతో బుట్టబొమ్మ డేటింగ్?
పూజా హెగ్డే, రోహన్ మెహ్రా గత కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లలో, పలు సినీ వేడుకల్లో జంటగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా 2024లో వీరిద్దరూ పూజ తల్లిదండ్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్లడం, ఆ తర్వాత ఒకే కారులో కనిపించడం చూస్తుంటే.. వీరి బంధం కేవలం స్నేహానికే పరిమితం కాదని, పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఎవరీ రోహన్ మెహ్రా?
రోహన్ బాలీవుడ్ దివంగత సీనియర్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. 1991లో జన్మించిన రోహన్ కెన్యాలో పెరిగాడు. ఆతర్వాత యూకేలో చదువు పూర్తిచేసుకుని.. చిత్ర పరిశ్రమలో కెరీర్ కొనసాగించడానికి ఇండియాకు తిరిగి వచ్చారు. సైఫ్ అలీ ఖాన్ సరసన 'బజార్' (2018) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత '420 IPC' వంటి చిత్రాల్లోనూ నటించాడు. అయితే పూజా గతంలో ఒక ఇంటర్యూలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోహన్ తో తన బంధం గురించి వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. అతను ఒక మంచి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చింది.
పూజా చేతిలో భారీ ప్రాజెక్టులు
వ్యక్తిగత జీవితం పక్కన పెడితే, వృత్తిపరంగా పూజ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన దేవా (Deva) మూవీలో నటిస్తుంది. మరో వైపు వరుణ్ ధావన్ హీరోగా, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai) చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ జూన్ 5, 2026న విడుదల కానుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan) నటించింది.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లీక్ వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి రోహన్ మెహ్రాతో డేటింగ్ వార్తలపై పూజ అధికారికంగా స్పందించే వరకు ఇవి పుకార్లుగానే మిగిలిపోతాయి. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విశేషాలతోనూ పూజ హెగ్డే ప్రస్తుతం 'టాక్ ఆఫ్ ది టౌన్'గా నిలుస్తోంది. మరి ఈ వార్తలపై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.

