Devara Item Song: హిట్ ఇచ్చిన హీరోయిన్తో దేవర ఐటమ్ సాంగ్.. ఇక థియేటర్స్లో పూనకాలే

Devara Item Song: హిట్ ఇచ్చిన హీరోయిన్తో దేవర ఐటమ్ సాంగ్.. ఇక థియేటర్స్లో పూనకాలే

దేవర(Devara).. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ. కొరటాల  శివ(Koratala Shiva) దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్(Saif alikhan) విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమా సంగీతం అందిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచానాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. 

ఇటీవల దేవర నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్, మతీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే.. ఏప్రిల్ 5నే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అదేంటంటే.. ఈ సినిమా కోసం అదిరిపోయే మాస్ ఇంటెమ్ సాంగ్ సెట్ చేశాడట కొరటాల. ఆ పాటకు అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉండనుందట. అయితే.. ఈ పాటలో ఎన్టీఆర్ తో చిందేసేందుకు పూజ హెగ్డేను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్టీఆర్, పూజ జంటగా నటించిన అరవింద సామెత వీర రాఘవ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మరోసారి ఆ సక్సెస్ కాంబోను రిపీట్ చేస్తూ దేవర కోసం పూజాని తీసుకున్నారట మేకర్స్.

ఇక పూజా కూడా గతంలో రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అనే ఐటెం సాంగ్ చేసింది. ఇప్పడు మళ్ళీ ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ ఐటెం సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని, దేవర సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. 

  • Beta
Beta feature