కెరీర్‌‌లో ఫస్ట్ టైమ్ ..లేడీ ఓరియెంటెడ్ మూవీలో పూజాహెగ్డే

కెరీర్‌‌లో ఫస్ట్ టైమ్ ..లేడీ ఓరియెంటెడ్ మూవీలో పూజాహెగ్డే

కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటించి లక్కీ హీరోయిన్‌‌‌‌ అనిపించుకుంది పూజాహెగ్డే. కానీ గత కొంతకాలంగా ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఇక బాలీవుడ్‌‌‌‌లోనూ పరాజయాలు పలకరించాయి. ఈ క్రమంలో కోలీవుడ్‌‌‌‌ నుంచి ఆమెకు ఓ గోల్డెన్ చాన్స్‌‌‌‌ వచ్చినట్టు తెలుస్తోంది. 

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఏవీఎం సంస్థ.. పూజాహెగ్డే హీరోయిన్‌‌‌‌గా ఓ సినిమా చేయబోతోందట. ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తీయబోయే ఈ చిత్రానికి డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం. ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌లోనే కనిపించిన పూజాహెగ్డేకు ఇలా ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్‌‌‌‌తో సినిమా చేయడం ఇదే ఫస్ట్‌‌‌‌ టైమ్. ఈ కొత్త చిత్రం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.