సల్మాన్ భాయిజాన్‌‌‌‌ మూవీ షూటింగ్‌‌‌‌తో బిజీ అయిన బుట్టబొమ్మ

సల్మాన్ భాయిజాన్‌‌‌‌ మూవీ షూటింగ్‌‌‌‌తో బిజీ అయిన బుట్టబొమ్మ

ఒకసారి స్టార్‌‌‌‌‌‌‌‌డమ్ వచ్చిందంటే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ క్రేజ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి స్టార్‌‌‌‌‌‌‌‌ స్టేటస్‌‌‌‌ను ఎంజాయ్ చేస్తోంది పూజా హెగ్డే. ఈ ఏడాది సౌత్‌‌‌‌లో హీరోయిన్‌‌‌‌గా వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటు సౌత్, అటు నార్త్‌‌‌‌ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల షూటింగ్స్ మధ్య చిన్న గ్యాప్ రావడంతో నెల రోజుల పాటు ఫారిన్‌ వెకేషన్‌‌‌‌కు వెళ్లింది.

ఇటీవలే హాలీడే టూర్ నుంచి తిరిగొచ్చిన పూజ, వచ్చీరాగానే సల్మాన్ మూవీ ‘భాయిజాన్‌‌‌‌’ షూటింగ్‌‌‌‌తో బిజీ అయింది. ఓ చిన్న షెడ్యూల్‌‌‌‌ కోసం సల్మాన్, పూజ కలిసి లడఖ్‌‌‌‌ వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. తిరిగి ముంబై చేరుకుని మేజర్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌తో పాటు యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ తీయనున్నారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌కు షూటింగ్‌‌‌‌ పూర్తిచేసి డిసెంబర్‌‌లో రిలీజ్ చేయనున్నారు. ఇది కాక విజయ్ దేవరకొండతో కలిసి ‘జనగణమన’లో నటిస్తోంది పూజ. త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో మహేష్‌‌‌‌కి జంటగా నటించబోతోంది.