Pooja Hegde: బుట్టబొమ్మ వేసుకున్న పట్టు పరికిణీ ధర ఎంతో తెలుసా!

Pooja Hegde: బుట్టబొమ్మ వేసుకున్న పట్టు పరికిణీ ధర ఎంతో తెలుసా!

ప‌చ్చ చీర..పింక్ డిజైన‌ర్ ప‌రికిణీ..త‌ల‌నిండుగా గులాబీలతో బుట్టబొమ్మ ఇచ్చిన స్టిల్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వ్వారెవ్వా ఈ లుక్కే అదుర్స్ అని మురిసిపోతున్నారు. పాత కాలం కోట లాంటి ఇల్లు సెట‌ప్..చుట్టూ కొబ్బ‌రి చెట్లు పరుచుకున్న ప‌చ్చ‌ద‌నంలో మెరిసిపోతోందీ ముద్దుగుమ్మ. ఇక ఓల్డ్ హెరిటేజ్ భ‌వంతుల్లో బుట్ట‌బొమ్మ హొయ‌లు భంగిమ‌లు చూడ‌త‌ర‌మా? అంటూ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా హెగ్డే (Pooja Hegde) ఇలా ట్రెడిషనల్ వేర్లో కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి..టుట్టి ఫ్రుట్టి క్యూటీ పట్టూటీ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ లంగా ఓణీలో చూసిన త‌ర్వాత కాబోయే పెళ్లి కూతుళ్లు ఎంతో ముచ్చ‌ట‌పడిపోయి దాని ధర ఎంత అని ఆరాలు తీస్తున్నారు. ఇంత‌కీ ఇది ఏ బ్రాండ్? అంటూ వెబ్ లో వెతికేస్తున్నారు.

ఈ డిజైన‌ర్ లంగావోణీ పాపుల‌ర్ బ్రాండ్ 'రా మ్యాంగో' షెల్ఫ్‌ల నుండి వచ్చింది. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ తాన్యా ఘార్వీ ఆమెనిలా తయారు చేసింది. దీని ధర రూ.1.39 లక్షలు.ప్రస్తుతం పూజా చేతిలో తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో పూజా నటిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)