బ్యూటీ షకీరా కాంస్య విగ్రహం..ఫ్యాన్స్ ఫిదా..ఎక్కడంటే?

బ్యూటీ షకీరా కాంస్య విగ్రహం..ఫ్యాన్స్ ఫిదా..ఎక్కడంటే?

కొలంబియన్ సూపర్ స్టార్..పాప్ సింగర్..తన వయ్యరాలతో ఆకట్టుకునే బ్యూటీ షకీరా(Shakira). బెల్లీ డ్యాన్స్ తో పాటు తన గొంతుతో ప్రపంచ సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసే షకీరా మరో అరుదైన గౌరవం సంపాదించుకుంది. 

2023 ఏడాదిలో గ్రామీ అవార్డు సొంతం చేసుకుంది షకీరా. ఇపుడు తన సొంత సిటీ అయిన కొలంబియాలోని బారంక్విలా లో షకీరా కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ విగ్రహం మ‌గ‌ద‌లీనా న‌ది ప‌క్క‌నే ఉన్న ఓ పార్క్‌లో..ష‌కీరా బెల్లీ డ్యాన్స్ ఫోజుతో ఉన్న స్టాచ్యూను పెట్టడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విగ్రహాన్ని సిటీ స్థానిక మేయర్ జైమ్‌ పుమరెజో..ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరించారు. 6.5మీ-పొడవు (21.3అడుగులు) అడుగుల షకీరా కాంస్య విగ్రహ ఆర్టిస్టు యినో మార్క్వేజ్ మాట్లాడుతూ..అమ్మాయిలు త‌మ క‌ల‌ల‌ను..చిన్నతనంలోనే పెట్టుకున్న తమ ఆశలను నెర‌వేర్చుకోవచ్చు అని, త‌మ‌కు కావాల్సిన ల‌క్ష్యాల‌ను అందుకోవ‌చ్చని..అందుకే ఆదర్శంగా ఉండేలా షకీరా విగ్రహం ఉంటుందని తెలిపారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shakira (@shakira)

 

అలాగే తన ఆట పాటలతో కొంతకాలంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఆమె.. లేటెస్ట్ గా సొంత ఊర్లో తన మైనపు బొమ్మను (statue) ఆవిష్కరించినట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.ఇక షకీరా రూపొందించిన 'వాకా వాకా' సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.