ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో 2026 ఆగస్టు 19 రాత్రి ICUలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన షావుకారు జానకి.. సడెన్ గా రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
షావుకారు జానకి 1931లో జన్మించారు. 1950లో షావుకారు మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. తన నటనా పాటవంతో ఎంతో మంది అభిమానులను సంపాదిచుకున్న ఆమె.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
