రిమోట్, వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్, టార్చ్ లైట్, టాయ్స్‌లాంటి వాటిలో బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అవుతుంటాయి. దాంతో పదే పదే కొత్త బ్యాటరీలు కొనాల్సి వస్తుంది. అలాంటి సమస్యకు సొల్యూషన్‌గా పోర్టోనిక్స్ అనే కంపెనీ ఈ రీచార్జబుల్ బ్యాటరీలను తీసుకొచ్చింది. వీటిని డిస్పోజబుల్ బ్యాటరీల్లా కాకుండా లిథియం అయాన్ సెల్ కంపోజిషన్‌తో తయారుచేశారు. ఈ ఏఏఏ బ్యాటరీల కెపాసిటీ 440ఎంఏహెచ్ ఉంటుంది.
ఇవి బిల్ట్–ఇన్ యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌తో వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా చార్జర్ అవసరం లేదు. ఏదైనా టైప్‌సీ కేబుల్‌తో నేరుగా చార్జ్ చేసుకోవచ్చు. డీసీ 5V/0.1A ఇన్‌పుట్, 1.5V/1.5A అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది.
లో సెల్ఫ్ డిశ్చార్జ్ టెక్నాలజీ వల్ల చాలాకాలం పనిచేస్తాయి. వీటిని వాడడం వల్ల బ్యాటరీల కోసం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. రిమోట్ కంట్రోల్ కార్లు, లైట్లు, ఎలక్ట్రిక్ బ్రష్‌లు, కెమెరాల్లో కూడా వాడొచ్చు.

