పోక్సో కేసులో కానిస్టేబుల్ అరెస్టు..కొత్తగూడెం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన

పోక్సో కేసులో  కానిస్టేబుల్ అరెస్టు..కొత్తగూడెం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో బెటాలియన్​ కానిస్టేబుల్​ వెంకటేశ్​ను అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ శుక్రవారం తెలిపారు. కొత్తగూడెంలోని టూ టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ప్రేమ పేరుతో బాలికను నగరంలోని పాత డిపో ప్రాంతంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి కొందరు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ఈ నెల 11న పోక్సో కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో ఏ6గా ఉన్న కానిస్టేబుల్​ వెంకటేశ్​ను కూడా అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.