ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. వెండి తెరపై తనదైన మ్యాజిక్‌తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పవన్.. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ రోజు ( సెప్టెంబర్ 2, 2026 ) ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి వెల్లువలా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారు
మోదీ ప్రశంసలు
పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే కూటమి సుపరిపాలన ఎజెండాను ఆంధ్రప్రదేశ్‌లో ముందుకు తీసుకెళ్లడంలో పవన్ చూపిస్తున్న చొరవ, పట్టుదలను ప్రధాని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని ఆత్మీయ సందేశానికి స్పందించిన పవన్.. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో ప్రధాని నాయకత్వమే తమకు స్ఫూర్తి అని, ఏపీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2026
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying… https://t.co/WzvG0JDtsO
ఆత్మీయ అభినందనలు..
ఏపీ పునర్నిర్మాణంలో పవన్ వహిస్తున్న పాత్రను సీఎం నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్పును ఆవిష్కరిస్తూ, ఉత్తమ ఫలితాలు అందిస్తున్న పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ… pic.twitter.com/L1cY5FVeR8
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2026
ఇక మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. 'నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న' అంటూ తన అనుబంధాన్ని చాటుకున్నారు. జనసైనికులు చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న… pic.twitter.com/Nh8gAYqVR4
— Lokesh Nara (@naralokesh) September 2, 2026
అన్నయ్య ఆశీస్సులు....
అందరికంటే ప్రత్యేకంగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన సందేశం. పవన్ మోకాళ్లపై కూర్చుని అన్నయ్యను ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోలను పంచుకుంటూ చిరు చేసిన పోస్ట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. చిన్నతనం నుంచే పవన్‌కు సమాజం పట్ల ఉన్న తపన, పిఠాపురం ప్రజలను సొంత కుటుంబంలా భావించే గుణాన్ని చిరంజీవి కొనియాడారు. గ్రామ గ్రామాన పరిపాలనను తీసుకెళ్తూ, పర్యావరణ పరిరక్షణకు పవన్ పడుతున్న శ్రమ గర్వంగా ఉందన్నారు. శ్రీ అంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..@PawanKalyan
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2026
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో… pic.twitter.com/FEFdNToZ9a
అన్నా కొణిదెల ఎమోషనల్..
మరోవైపు, ఆయన సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసి ఉన్న ఒక క్యూట్ పిక్‌ను షేర్ చేశారు. 'ఎంతోమంది హృదయాల్లో నిలిచిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వెండితెర వైబ్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్ 90ల నాటి క్లాసిక్ వింటేజ్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ తన మామయ్యకి డిఫరెంట్‌గా విష్ చేశారు.
Many Happy Returns of the day to Power Star @PawanKalyan garu#OGPowerStar pic.twitter.com/BdlAx8B3o7
— Allu Arjun (@alluarjun) September 2, 2026
ఇక అభిమానుల ఊపిరి నిలిపిన ‘OG’ దర్శకుడు సుజీత్, ఒక సాధారణ అభిమానిగా థియేటర్లో విజిల్స్ వేసే స్థాయి నుండి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ "మై హీరో.. మై G" అంటూ 4:05 PM కి సర్ప్రైజ్ ట్రీట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
To the man I grew up admiring…
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️… pic.twitter.com/RoeZcylAYv
రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా, సినిమాలో తిరుగులేని పవర్ స్టార్ గా నిలిచిన పవన్ కల్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అటు ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు కేక్ లు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.
