థియేటర్స్‌లో ప్లాప్, టీవీల్లో సూపర్ హిట్.. భారీ టీఆర్పీతో అదరగొట్టిన ఆదిపురుష్

థియేటర్స్‌లో ప్లాప్, టీవీల్లో సూపర్ హిట్.. భారీ టీఆర్పీతో అదరగొట్టిన ఆదిపురుష్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా నటించిన మూవీ ఆదిపురుష్ (Adipurush). భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ అమెజాన్ ప్రైమ్(Amazon prime) లో రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. .

లేటెస్ట్ గా ప్రభాస్ రామాయణంని బుల్లెతెరపై  బంపర్ హిట్ మూవీగా నిలిచేలా చేశారు ఆడియన్స్. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేయగా..ఈ సినిమాకు ఏకంగా 9.47 (అర్బన్) రేటింగ్ వచ్చింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో వచ్చిన రేటింగ్స్ అన్నిటినీ చూసుకుంటే..ఆదిపురుష్ సినిమా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్టని చెప్పుకోవాలి. 

రిలీజ్ టైములో ఆదిపురుష్ మూవీపై వచ్చిన నెగిటివిటీ అంత..ఇంత కాదు. అలాంటి మూవీ ఓటీటీలో,టెలివిజన్ లో హిట్ అవ్వడం చాలా గొప్ప విషయమని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ప్రసారం అయ్యే టైంలోనే..వరల్డ్ కప్ మ్యాచ్ కూడా టీవీ లలో ప్రసారం అవుతున్న..ఇంత పెద్ద రేటింగ్ తెచ్చుకోవడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇక రీసెంట్ సూపర్ హిట్ మూవీస్ గా నిలిచిన బాలయ్య వీర సింహారెడ్డి(8.41),  చిరంజీవి వాల్తేరు వీరయ్య (5.41) టీఆర్పి రేటింగ్స్ రాగా.. పవన్ కళ్యాణ్ బ్రో, గాడ్ ఫాదర్, కార్తికేయ-2, సర్దార్ సినిమాలు కూడా టెలివిజన్ షో లో అంతగా రేటింగ్ తెచ్చుకోలేదు. రవితేజ, ధమాకా, వెల్డండి వేణు బలగం మూవీస్ మాత్రమే టెలివిజన్ లోను సత్తా చాటాయి.