బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 3 నుంచి చివరి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయనున్నారట మేకర్స్.
ఇందులో ప్రభాస్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి -సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఎండింగ్‌లో డిసెంబర్ 3న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
