కలర్ ఫుల్ లుక్లో డార్లింగ్ ప్రభాస్.. మారుతీ మూవీ అప్డేట్ వచ్చేసింది

కలర్ ఫుల్ లుక్లో డార్లింగ్ ప్రభాస్.. మారుతీ మూవీ అప్డేట్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) డైరెక్టర్ మారుతి(Maruthi) కాంబోలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రాని ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. 

ఈ సినిమా సెట్స్ నుండి లీకైన ప్రభాస్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా రిలీజైన ప్రభాస్ కలర్ ఫుల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమాకు ముందు నుండి రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. మరి అదే టైటిల్ ను ఫైనల్ చేస్తారా లేక కొత్త టైటిల్ ని ఫిక్స్ చేస్తారా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING ?

First Look and Title will be unveiled on Pongal ?#Prabhas #PrabhasPongalFeast ❤️‍?

A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z

— People Media Factory (@peoplemediafcy) December 29, 2023

ఇక మారుతి గత సినిమాల స్టైల్లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.