త్రివిక్రమ్తో ప్రభాస్ మూవీ.. సందీప్ మూవీ కన్నా ముందే?

త్రివిక్రమ్తో ప్రభాస్ మూవీ.. సందీప్ మూవీ కన్నా ముందే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ, మారుతి లాంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఒకే చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అవును త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్రివిక్రమ్ గత సినిమాల లాగే ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో రానుందట. ఈ క్రేజీ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కాలం సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా తరువాత ఆయన అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే.. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ సినిమా కంటే ముందే ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ రిలీజ్ టెన్షన్ లో ఉన్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.