మాకు ఆ హీరోయినే కావాలి.. సందీప్ వంగకు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

మాకు ఆ హీరోయినే కావాలి.. సందీప్ వంగకు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga).. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. తీసింది రెండు సినిమాలే కానీ.. క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్. మొదటి సినిమా అర్జున్ రెడ్డి(Arjun reddy)తోనే ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సందీప్.. రెండో సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం తనవైపుకు తిరిగేలా, తన గురించి మాట్లాడుకునే చేశాడు. అంతేకాదు.. సినిమాల్లో వైలెన్స్ అనే పదానికి కేరాఫ్ గా మారిపోయాడు. ఇక ఇటీవల ఈ దర్శకుడి నుండి వచ్చిన యానిమల్(Animal) మూవీ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరవెనుక సందీప్ టేకింగ్, తెరపై రణ్బీర్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది ఈ మూవీ. కేవలం పదిరోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది యానిమల్ మూవీ. 

దీంతో.. సందీప్ రెడ్డి నుండి వచ్చే తరువాతి సినిమాపై ఆటోమేటిక్ గా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక సందీప్ తన తరువాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో చేస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్(Spirit) పేరుతో రానున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుందని సందీప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది చివర్లో మొదలుకానుంది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సందీప్ కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. 

అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. త్రిప్తి డిమ్రీ యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. జోయా పాత్రలో ఆమె కనిపించింది చిన్న పాత్రలో అయినా.. ఆడియన్స్ లో నెక్స్ట్ లెవల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా త్రిప్తి డిమ్రీ గురించే చర్చ నడుస్తోంది. దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఆమెనే తీసుకోవాలంటూ సందీప్ కు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు ప్రభాస్ ఫాన్స్. మరి ఫ్యాన్స్ కోరిక సందీప్ రెడ్డి తీరుస్తాడా అనేది చూడాలి.